: ఖతార్ విమానాన్ని అనుసరించిన బ్రిటిష్ యుద్ధవిమానం!
దోహా నుంచి మాంచెస్టర్ వచ్చిన ఖతార్ ఎయిర్ వేస్ విమానంలో అనుమానాస్పద వస్తువు ఉందని కంట్రోల్ రూంకి సమాచారం అందింది. దానిని నిర్ధారించుకున్న అధికారులు ప్రమాద నివారణ చర్యలకు ఉపక్రమించారు. బ్రిటిష్ యుద్ధ విమానంతో దానికి రక్షణ ఏర్పాటు చేశారు. ఆకాశంలోనే ఖతార్ విమానాన్ని బ్రిటిష్ యుద్ధవిమానం అనుసరించింది. అనంతరం ఖతార్ విమానాన్ని మాంచెస్టర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అంతకు ముందే విమానాశ్రయానికి భారీ భద్రత ఏర్పాటు చేశారు. విమానం దిగగానే అధికారులు దానిని తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తిని, వస్తువును స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఆ వస్తువు ఏంటన్నది మాత్రం వెల్లడించలేదు. ఈ సమయంలో ఖతార్ విమానంలో 269 మంది ప్రయాణికులు, 13 మంది సిబ్బంది ఉన్నారు.