: హైదరాబాద్ చేరుకున్న కామన్వెల్త్ విజేతలు
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లో పతకాలు సాధించిన తెలుగు తేజాలు పీవీ సింధు, పారుపల్లి కశ్యప్ హైదరాబాద్ చేరుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్ పురుషుల బ్యాడ్మింటన్ లో పారుపల్లి కశ్యప్ స్వర్ణపతకం సాధించగా, పీవీ సింధు కాంస్యపతకం సాధించింది. వీరితో పాటు గురుసాయిదత్, ఇతర క్రీడాకారులు హైదరాబాద్ చేరుకున్నారు. వారందరికీ బ్యాడ్మింటన్ సంఘం అధికారులు సాదర స్వాగతం పలికారు.