: నిత్యావసర వస్తువుల ధరలపై చంద్రబాబు సమీక్షా సమావేశం
నిత్యావసర వస్తువుల ధరలపై ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కూరగాయల రవాణాకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయాలన్నారు. కుప్పం తరహాలో అన్ని చోట్ల సంచార విక్రయశాలలను ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు.