: రీజనరేటెడ్ వాటర్ తో లక్ష ఎకరాలకు నీరందిస్తాం: కేసీఆర్
కరీంనగర్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీతో పాటు నిమ్స్ తరహాలో ఆసుపత్రిని నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎలగందుల కోట, కొండగట్టు, వేములవాడను అభివృద్ధి చేస్తామన్నారు. కొండగట్టులో తిరుపతి తరహాలో విల్లాలను నిర్మిస్తామని ఆయన తెలిపారు. రామగుండం ఎన్టీపీసీలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించామని ఆయన చెప్పారు. కాకతీయ కెనాల్ బ్రాంచ్ కెనాల్స్ ను ఆధునికీకరిస్తామని అన్నారు. రీజనరేటెడ్ వాటర్ తో లక్ష ఎకరాలకు నీరందిస్తామని ఆయన చెప్పారు. సింగరేణి గనుల్లో కేంద్రానికి ఉన్న 49 శాతం వాటాను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కేసీఆర్ చెప్పారు. ఇతర దేశాల్లో ఉన్న గనులను సింగరేణి కొనుగోలు చేస్తుందన్నారు. ఇతర దేశాల్లో లక్షమందికి సింగరేణి ఉద్యోగాలిస్తుందని ఆయన చెప్పారు.