: గాయపడ్డ విద్యార్థులు రామాయంపేట ఆస్పత్రికి తరలింపు
మాసాయిపేట రైల్వే గేట్ ఘటనలో గాయపడ్డ చిన్నారులను మెదక్ జిల్లా రామాయంపేట ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో 15 మంది చనిపోయినట్టు ప్రాథమిక సమాచారం. ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద సహాయ చర్యలు జరుగుతున్నాయి.