: యువీ, గంభీర్, పుజారా ఔట్... సంజు శాంసన్, కులకర్ణి, కరణ్ శర్మ ఇన్
ఇంగ్లండ్ పర్యటనలో పాల్గొనే వన్డే జట్టును బీసీసీఐ ప్రకటించింది. భారత జట్టు సీనియర్ ఆటగాడు యువరాజ్ సింగ్ కు జట్టులో చోటు కల్పించకపోవడం విశేషం. టెస్టుల్లో అనుభవలేమి కారణంగా పేలవ ప్రదర్శనపై పలు విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో అనుభవజ్ఞుడైన యువరాజ్ సింగ్ పై వేటు వేయడమంటే సెలక్టర్లు సాహసం చేసినట్టేనని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. యువీతో పాటు గంభీర్, ఛటేశ్వర్ పూజారాలకు కూడా సెలెక్టర్లు మొండి చెయ్యి చూపారు. వారి స్థానంలో సంజూశాంసన్, కరణ్ శర్మ, ధవళ్ కులకర్ణికి జట్టులో చోటు కల్పించారు. కాగా, గతంలో ధవళ్ కులకర్ణి గతంలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ధోనీ కెప్టెన్ గా వ్యవహరించనుండగా, భారత టెస్టు జట్టుతో రాయుడు, సంజు శాంసన్, ధవళ్ కులకర్ణి, కరణ్ శర్మ కలవనున్నారు. టెస్టుల్లో ఆడేందుకు వెళ్లనున్న గంభీర్ తో పాటు పూజారా టెస్టులు ముగిసిన తరువాత వెనుదిరగనున్నారు. కాగా, మిగిలిన టెస్టు జట్టు మొత్తం యథావిధిగా వన్డేల్లో ఆడనుంది.