: టీచర్ పై అత్యాచారం చేసిన టీచర్
ఉన్నత విలువలు నేర్పి సమాజాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడిగా మారి సహోద్యోగిపై అత్యాచారానికి పాల్పడి గురువన్న పదానికే కళంకం తెచ్చాడు. బెంగళూరులో గెస్ట్ టీచర్ గా పాఠాలు చెప్పేందుకు వచ్చిన మహిళపై ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. మరో ఘటనలో అరాచకాల ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో దుండగులు టీచర్ పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.