: ఒడిశాలో వరదల్లో చిక్కుకుని 25 మంది మృతి
ఒడిశాలోని 13 జిల్లాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదల బారిన పడి ఇప్పటివరకు 25 మంది మరణించినట్లు సమాచారం. మహానది ఉగ్రరూపం దాల్చి ఉద్ధృతంగా ప్రవహించడంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్రంలో మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కురవడంతో భువనేశ్వర్ లోనూ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.