: ఏపీ రాజధాని కోసం కోటి రూపాయల విరాళమిచ్చిన కేసీపీ ప్రతినిధులు


ఆంద్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం కేసీపీ ప్రతినిధులు కోటి రూపాయల విరాళమిచ్చారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వారు ఈ మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబును చెరుకు రైతులు కలిసి మాట్లాడారు. నష్టాల్లో ఉన్న చక్కెర పరిశ్రమలను ఆదుకుంటామని వారికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. చక్కెరపై వ్యాట్ ఎత్తివేసే అంశాన్ని పరిశీలిస్తానని ఆయన రైతులతో చెప్పారు.

  • Loading...

More Telugu News