: గూగుల్ సెర్చ్ లో మనవాడి జోరు
కామన్వెల్త్ క్రీడల సందర్భంగా అత్యధికులు గూగుల్ లో వెదికింది భారత రెజ్లర్ సుశీల్ కుమార్ గురించేనట. గ్లాస్గోలో మన రెజ్లర్లు ఉడుం పట్టు పట్టడంతో పతకాలు పాదాక్రాంతమయ్యాయి. రెజ్లర్ల చలవతో ఐదు పసిడి పతకాల సహా 13 పతకాలు మన ఖాతాలో పడ్డాయి. గ్లాస్గోలో ఈ క్రీడలు జరుగుతున్న సమయంలో వస్తాదులు జోరు మీదుండడంతో అభిమానాలు వారి గురించి విపరీతంగా సెర్చ్ చేశారట. అందరిలోకి సుశీల్ కుమార్ గురించే ఎక్కువగా వెతికారట. సుశీల్ ఈ క్రీడల్లో 74 కేజీల కేటగిరీలో స్వర్ణం సాధించడం తెలిసిందే.