: కామన్వెల్త్ గేమ్స్ లో విజేతలకు నజరానా
కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు పతకాలు సాధించిపెట్టిన విజేతలకు భారత బాడ్మింటన్ సంఘం నజారానా ప్రకటించింది. గోల్డ్ మెడల్ సాధించిన కశ్యప్ కు 25 లక్షల రూపాయల నగదు బహుమతి ప్రకటించింది. 32 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత మెన్స్ సింగిల్స్ లో భారత్ కు కశ్యప్ స్వర్ణ పతకాన్ని తీసుకొచ్చాడు. గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలకు చెరో 10 లక్షల రూపాయలను అందించనుంది. అలాగే సింధు, గురుసాయిదత్ కు చెరో 5 లక్షల నగదు బహుమతిని బాడ్మింటన్ సంఘం ప్రకటించింది.