: కమల్ నాథన్ కమిటీని కలసిన తెలంగాణ ఉద్యోగులు


తెలంగాణ సచివాలయ ఉద్యోగులు ఈరోజు (మంగళవారం) కమల్ నాథన్ కమిటీని కలిశారు. 18ఎఫ్ నిబంధనను వెంటనే తొలగించాలని టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏ రాష్ట్ర ఉద్యోగులను ఆ రాష్ట్రానికే కేటాయించాలని ప్రభుత్వాన్ని నరేందర్ రావు కోరారు. కమిటీ మార్గదర్శకాల్లో నివాసం అనే పదాన్ని తొలగించి స్థానికత అనే పదాన్ని కూడా చేర్చాలని విజ్ఞప్తి చేశారు. స్థానికత ఆధారంగానే ఉద్యోగులను విభజించాలన్న ఆయన... భార్యభర్తలిద్దరూ స్థానికులైతే వారిని తెలంగాణకే కేటాయించాలని చెప్పారు. అక్టోబర్ 31లోగా ఉద్యోగుల విభజనను పూర్తి చేయాలని సర్కారుకు నివేదించారు.

  • Loading...

More Telugu News