: కరీంనగర్ పై కేసీఆర్ వరాల జల్లు
కరీంనగర్ జిల్లాపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఇవాళ కరీంనగర్ కలెక్టరేట్ కు వచ్చిన కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరీంనగర్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఎల్ఎండీలోని మానేరు గార్డెన్ ను బృందావన్ గార్డెన్ గా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. రాష్ట్ర స్థాయిలో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తామన్నారు. నాలుగేళ్లలో గ్రామీణ ప్రాంతాలకు తాగునీటి సరఫరాను మెరుగుపరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. కరీంనగర్ తో పాటు ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ లను అంతర్జాతీయ స్థాయి నగరాలుగా మారుస్తామని కేసీఆర్ అన్నారు.