: కవితపై కేసు నమోదు చేయండి: కోర్టు
టీఆర్ఎస్ ఎంపీ కవితపై కేసు నమోదు చేయాలని మాదన్నపేట పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది. దీనిపై పోలీసులు విచారణ జరపాలని కూడా న్యాయస్థానం సూచించింది. కవిత వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టులో బీజేపీ నేత కరుణసాగర్ పిటిషన్ దాఖలు చేశారు. భారత్ లో కాశ్మీర్, తెలంగాణ అంతర్భాగం కాదని ఎంపీ కవిత వ్యాఖ్యానించడంపై ఆయన కోర్టులో పిటీషన్ వేశారు.