: మున్నాభాయ్ కి రేపటి వరకు టెన్షనే..


ముంబయి బాంబు పేలుళ్ళ కేసులో లొంగిపోయేందుకు కొన్ని వారాలు గడువు కోరుతూ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీం కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ కేసులో సంజయ్ దత్ కు సుప్రీం ఐదేళ్ళ జైలుశిక్షను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 18 లోపు ఆయన కోర్టు ఎదుట లొంగిపోవాలని కూడా అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే, ప్రస్తుతం తాను నటిస్తున్న చిత్రాలు పూర్తి చేసేందుకు మరికాస్త సమయం కావాలంటూ సంజయ్ దత్ నిన్న సుప్రీంకు విన్నవించుకున్నాడు.

  • Loading...

More Telugu News