: పాలస్తీనాతో భారత్ ఫ్రెండ్లీ సాకర్ పోరు
భారత ఫుట్ బాల్ జట్టు పాలస్తీనా జట్టుతో రెండు స్నేహపూర్వక మ్యాచ్ లలో తలపడనుంది. అక్టోబర్ 6, 9 తేదీల్లో ఈ అంతర్జాతీయ మ్యాచ్ లు జరుగుతాయని ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) తెలిపింది. కాగా, వేదికలను ఖరారు చేయాల్సి ఉంది. ప్రస్తుతం భారత సాకర్ జట్టు ఫిఫా ర్యాంకుల్లో 151వ స్థానంలో ఉండగా, మనకన్న మెరుగైన పాలస్తీనా జట్టు 85వ స్థానంలో ఉంది. 2013లో కోచి వేదికగా ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ 2-4తో ఓటమిపాలైంది.