: కేంద్రం వెనకడుగు వేస్తోంది... ఆ సత్తా మాకు ఉంది: నాయిని
హైదరాబాద్ శాంతి భద్రతలను గవర్నరుకు అప్పగించడంపై కేంద్రం వెనక్కి తగ్గినట్టు తమకు సమాచారం ఉందని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కొందరు కావాలని కుట్రచేసి హైదరాబాదుపై గవర్నర్ పెత్తనం చేసేలా ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలు చూసుకునే అధికారం తమకు ఉందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో పోలీస్ ఇమేజ్ ని ఉచ్ఛస్థాయికి తీసుకెళ్తామని నాయిని తెలిపారు.