: పాకిస్థాన్ లో ఉగ్ర'వధ'
పాకిస్థాన్ వాయుసేన ఉగ్రవాదులపై విరుచుకుపడింది. ఉత్తర వజీరిస్తాన్ లోని మిలిటెంట్ స్థావరాలపై మంగళవారం బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, 6 స్థావరాలు ధ్వంసమయ్యాయని సైన్యం తెలిపింది. జూన్ 15 నుంచి 'జర్బ్-ఏ-అజబ్' పేరిట పాక్ ఆర్మీ గిరిజన ప్రాంతాల్లోని తీవ్రవాద నెలవులపై దాడులు జరుపుతోంది. ఇప్పటివరకు ఈ దాడుల్లో 600 మంది మిలిటెంట్లు చనిపోగా, 100 స్థావరాలు నేలమట్టం అయ్యాయి. ఈ క్రమంలో 35 మంది పాక్ సైనికులు కూడా మృతి చెందారు. దాడుల సందర్భంగా ఉత్తర వజీరిస్తాన్ ప్రాంతం నుంచి 10 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.