: రాజమండ్రి-కొవ్వూరు వంతెనను వచ్చే ఏడాదికల్లా పూర్తి చేస్తాం: మంత్రి శిద్ధా
రాజమండ్రి - కొవ్వూరు వంతెనను వచ్చే ఏడాది మార్చికల్లా పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి శిద్ధా రాఘవరావు చెప్పారు. గోదావరి పుష్కరాల సమయానికి వంతెనను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన అన్నారు. రాజమండ్రి రోడ్ కమ్ రైలు వంతెన మరమ్మతుల కోసం రూ.2.50 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు.