: ప్రియుడ్ని కట్టేసి...కళ్ల ముందే ప్రియురాల్ని కాటేశారు
తమిళనాడులో అత్యాచారాలు పెరుగుతున్నాయి. ధర్మపురి సమీపంలో ప్రియుడితో కలిసి వెళ్తున్న ప్రియురాలిపై సామూహిక అత్యాచారం ఘటన మరువక ముందే, మరో ఘోరం జరిగింది. ప్రియుడిని చెట్టుకి కట్టేసి ప్రియురాలిని కాటేశారు కామాంధులు. కన్యాకుమారి జిల్లా తిట్టువిలై ప్రాంతానికి చెందిన అరివాల్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఇతను తిరునల్వేలిలో కంప్యూటర్ సేల్స్ ఆండ్ సర్వీస్ చేస్తుంటారు. నాగర్ కోయిల్ ప్రాంతానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు అరివాల్. వీరిద్దరూ తిరునల్వేలిలో పలు ప్రాంతాలు సందర్శించి సాయంత్రం తమ ఊరుకి బయల్దేరారు. జంట వెళ్లడం గమనించిన ముగ్గురు కామాంధులు నాంగునేరి కళక్కాడు రోడ్డులో జియ్యర్ కుళం సమీపంలో వీరిని అటకాయించారు. సమీపంలోని తోటల్లో ప్రియుడ్ని చెట్టుకు కట్టేసి అతని కళ్ల ముందే అతని ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత అరివాల్ వద్దనున్న ల్యాప్ టాప్, రెండు సెల్ ఫోన్లు లాక్కుని పరారయ్యారు. దీనిపై అరివాల్ స్ధానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువతిని ఆమె బంధువుల ఇంటికి చేర్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.