: తిరుమల ఘాట్ రోడ్డు సమీపంలో భారీ అగ్నిప్రమాదం
తిరుమలలోని శేషాచలం అడవుల్లో మళ్లీ కార్చిచ్చు రేగింది. మొదటి ఘాట్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 16వ మైలురాయి సమీపంలోని అటవీప్రాంతంలో మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అటవీ, అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఇంతకు ముందు కూడా శేషాచలం అడవుల్లో కార్చిచ్చు వ్యాపించడంతో... ఫైర్ సిబ్బంది అతి కష్టం మీద అదుపు చేయగలిగారు.