: ఢిల్లీలో రాష్ట్రపతి పాలనపై ప్రశ్నించిన సుప్రీం


దాదాపు ఏడు నెలలకు పైగా ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కొనసాగుతుండటంపై దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. ఈ విషయంపై ప్రతిష్ఠంభన ముగించి త్వరలో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికైన ఎమ్మెల్యేలు పనిలేకుండా ఇంట్లో కూర్చోవాలా? అని అడిగిన న్యాయస్థానం, శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచాల్సిన అవసరం ఏముందని కేంద్రాన్ని నిలదీసింది. ఇంతవరకు ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని కేంద్రానికి సుప్రీం నోటీసు పంపింది. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) పరిశీలించిన కోర్టు పైవిధంగా స్పందించింది.

  • Loading...

More Telugu News