: కరీంనగర్ లో పర్యటిస్తున్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇవాళ (మంగళవారం) కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం నుంచి కార్పొరేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. పర్యటన మధ్యలో కేసీఆర్ ఓ చోట బస్సు దిగి, ఓ స్వాతంత్ర్య సమరయోధుడిని ఆప్యాయంగా పలుకరించారు. కాసేపట్లో కలెక్టరేట్ లో ప్రజాప్రతినిదులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు.