: కామన్ వెల్త్ పతక విజేతలకు మోడీ అభినందనలు
కామన్ వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించి విజేతలుగా నిలిచిన భారత క్రీడాకారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. కామన్ వెల్త్ క్రీడల్లో భారత్ కు చెందిన పలువురు ఆటగాళ్లు పతకాలను సాధించడం దేశానికి ఎంతో గర్వకారణమని ఆయన ప్రశంసించారు. స్కాట్ లాండ్ లోని గ్లాస్గోలో జరిగిన క్రీడల్లో భారత్ 64 పతకాలు సాధించి ఐదవ ర్యాంకులో నిలిచింది.