: సునంద, థరూర్ మధ్య రహస్యాలు వెలుగులోకొస్తున్నాయి!


కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్, సునంద పుష్కర్ ల మధ్య చోటుచేసుకున్న రహస్యాలు కొన్ని వెల్లడయ్యాయి. ప్రముఖ జర్నలిస్టు నళిని సింగ్ వీటిని బహిర్గతం చేశారు. చనిపోవడానికి ముందు కొన్ని రోజులుగా సునంద, థరూర్ వ్యవహార సరళిపై తీవ్ర మనస్థాపం చెందారని నళిని వెల్లడించారు. అంతేగాక, చనిపోవడానికి ముందు తెల్లవారుజామున ఉదయం 4 గంటల దాకా లీలా హోటల్ గదిలో వారిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగిందని, దీనిని హోటల్ సిబ్బంది కూడా ధృవీకరించినట్లు ఆమె పేర్కొన్నారు. పాకిస్తానీ జర్నలిస్టు మెహర్ తరార్ పట్ల థరూర్ ఆకర్షితమవుతున్న తీరు పట్ల తనతో సునంద పలుమార్లు మాట్లాడిందని నళిని చెబుతున్నారు. తరార్ ను పెళ్లి చేసుకునేందుకు థరూర్ పచ్చజెండా ఊపాడని, దీనికి ఆయన కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఉందని సునంద ఆవేదన వ్యక్తం చేసిందన్నారు. అంతేగాక తరార్, థరూర్ లు కొన్ని రొమాంటిక్ మెసేజ్ లను కూడా పంచుకున్నారని ఆమె వాపోయిందని తెలిపారు. ఆ తరహా మెసేజ్ లలో ఓ దానిలో థరూర్, తనకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు ఉండగా, మరోదానిలో థరూర్ లేకుండా తాను ఉండలేనని తరార్ ప్రేమ ఒలకబోసిన వైనాన్ని చూసినట్లు సునంద తెలిపిందన్నారు. ఈ విషయాలను సునంద స్వయంగా తనతో చెప్పి బాధపడిందని నళిని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News