: సెప్టెంబర్ 5న ఆంధ్రప్రదేశ్ డిఎస్సీ నోటిఫికేషన్


ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ నోటిఫికేషన్ ను సెప్టెంబర్ 5న విడుదల చేయబోతున్నామని ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో 10,603 పోస్టుల భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. ఈ పోస్టుల్లో... స్కూల్ అసిస్టెంట్లు -1847, ఎస్ జీటీలు-7594, లాంగ్వేజ్ పండిట్స్ -975, పీఈటీ పోస్టులు-185 ఉన్నాయని ఆయన పేర్కొన్నారు . ప్రభుత్వ పాఠశాలలో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు... ఆ పాఠశాలలో చదివి విదేశాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులను సంప్రదిస్తున్నామని ఆయన తెలిపారు. విదేశాల్లో స్థిరపడ్డ పూర్వవిద్వార్థులకు ....వారు చదువుకున్న పాఠశాలలను దత్తత ఇచ్చేందుకు నిర్ణయించామని గంటా తెలిపారు. దీనికోసం త్వరలో మార్గదర్శకాలు రూపొందించనున్నామని మంత్రి తెలిపారు.

  • Loading...

More Telugu News