: హైదరాబాద్ బిచ్చగాళ్లను గవర్నమెంట్ హోమ్స్ కు తరలించండి: హైకోర్టు


హైదరాబాద్ లో బిచ్చగాళ్లను గవర్నమెంట్ హోమ్స్ కు పంపించాలని హైదరాబాద్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. నగరంలో బిచ్చగాళ్ల మాఫియాను అరికట్టాలని దాఖలైన ఓ పిటిషన్ పై హైకోర్టు ఈ రోజు విచారణ చేసింది. 'బెగ్గర్ మాఫియా'పై సిటీ పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి హైకోర్టుకు నివేదిక అందజేశారు. విచారణ సందర్భంగా హైదరాబాద్ లో బెగ్గర్ మాఫియా లేదని పోలీసుల తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. అయితే ఈ వాదనతో హైకోర్టు పూర్తిగా ఏకభవించకుండా బిచ్చగాళ్లను ప్రభుత్వ హోమ్స్ కు తరలించాలని పోలీసులకు సూచన చేసింది.

  • Loading...

More Telugu News