: ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్టీఆర్ క్యాంటీన్లు... రూ.5కే పేదలకు భోజనం
పేదప్రజల కోసం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఏర్పాటు చేసిన 'అమ్మ' క్యాంటీన్ల తరహాలో... త్వరలో ఏపీలో కూడా క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. ఎన్టీఆర్ క్యాంటీన్ల పేరుతో త్వరలోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తామని ఆమె ప్రకటించారు. ఎన్టీఆర్ క్యాంటీన్ల ద్వారా రూ.5 కే పేదలకు రుచికరమైన భోజనం అందిస్తామని ఆమె అన్నారు. ఈ నెల 8న అన్ని శాఖల మంత్రులతో సమావేశమై ఈ పథకానికి తుదిరూపు ఇస్తామని ఆమె తెలిపారు. త్వరలోనే దీపం పథకం కింద మహిళలకు 5 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో పౌరసరఫరాల శాఖకు రూ.4 వేల కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కోరానని ఆమె పేర్కొన్నారు.