: తీవ్రవాదుల చొరబాటు యత్నాన్ని భగ్నం చేసిన భారత బలగాలు
జమ్మూకాశ్మీర్ వద్ద నియంత్రణ రేఖకు సమీపంలో తీవ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత బలగాలు భగ్నం చేశాయి. గతరాత్రి భారీగా ఆయుధాలు ధరించిన ఓ మిలిటెంట్ల బృందం పూంచ్ జిల్లాలోని తార్కుండి వద్ద భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది. ఇది గమనించిన భారత సైన్యం కాల్పులు జరపడంతో మిలిటెంట్లు తోక ముడిచారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గాలింపు నిర్వహిస్తున్నారు.