: 'గీతాంజలి' దర్శకుడు రాజ్ కిరణ్ కు గుండెపోటు
కథానాయిక అంజలి ప్రధాన పాత్రలో తాజాగా తెరకెక్కిన 'గీతాంజలి' చిత్ర దర్శకుడు రాజ్ కిరణ్ గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను హైదరాబాదు మెహదీపట్నంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. సినిమా విడుదల ఆలస్యం అవుతుండడంతో రాజ్ కిరణ్ ఒత్తిడికి గురయ్యారని, ఈ క్రమంలోనే గుండెపోటు వచ్చిందని సమాచారం. కాగా, ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కావాల్సి ఉంది.