: బీమా బిల్లుపై కాంగ్రెస్ లో ద్వంద్వ ప్రమాణాలు లేవు: రాహుల్


బీమా రంగంలో ఎఫ్ డీఐలను 26 నుంచి 49 శాతానికి పెంచేందుకుగాను ఎన్డీఏ తీసుకొస్తున్న బీమా చట్ట సవరణ బిల్లుపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆరోపణలను ఖండిస్తూ, బిల్లుపై కాంగ్రెస్ లో ద్వంద్వ ప్రమాణాలు లేవని స్పష్టం చేశారు. అంతేగాక, బిల్లుపై ఎలాంటి రాజకీయ ఏకాభిప్రాయం కూడా లేదని చెప్పారు. ఇప్పటికే ఈ అంశంపై నిన్న (సోమవారం) విపక్షాలతో కేంద్ర మంత్రులు చర్చలు జరిపినా ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో రేపు మరోసారి బీమా బిల్లుపై చర్చలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News