: ఆంధ్ర వైద్యులు దాడిచేశారంటూ... గాంధీ ఆసుపత్రిలో తెలంగాణ వైద్యుల ఆందోళన


సికింద్రాబాదు గాంధీ ఆసుప్రతిలో వాతావరణం వేడెక్కింది. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన డాక్టర్ల మధ్య గొడవ గాంధీ ఆసుపత్రి పరిసరాలలో ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన డాక్టర్లు విధులకు సరిగ్గా హాజరుకావడం లేదని తెలంగాణ డాక్టర్లు ఆరోపించారు. సీమాంధ్ర డాక్టర్లు డ్యూటీకి రావద్దని, వారు తమ ప్రాంతానికి వెళ్లిపోవాలని ఆసుపత్రిలో తెలంగాణ డాక్టర్లు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో రెండు ప్రాంతాల డాక్టర్ల మధ్య గొడవ మొదలైంది. హెచ్చరిక బోర్డులు పెట్టడానికి తెలంగాణ డాక్టర్లు ఎవరని ఆంధ్ర ప్రాంత డాక్టర్లు ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం మొదలై గాంధీ ఆసుపత్రిలో తీవ్ర రభసకు కారణమైంది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వైద్యులు తమపై దాడి చేశారంటూ... తెలంగాణ వైద్యులు ఆసుపత్రి సూపరింటెండ్ కు ఫిర్యాదు చేశారు. స్థానికత ఆధారంగానే గాంధీ ఆసుప్రతిలో ఇకపై నియామకాలు జరిపించాలని తెలంగాణ వైద్యులు సూపరింటెండ్ ను కోరారు. ఆసుపత్రి ఉన్నతాధికారులు తెలంగాణ డాక్టర్ల ఆందోళనను విరమింపచేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News