: సోనియా, రాహుల్ ల పిటిషన్లపై నేడు ఢిల్లీ కోర్టులో విచారణ


నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు దాఖలు చేసిన పిటిషన్ లపై ఢిల్లీ హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన పిటిషన్ దారుడైన సుబ్రహ్మణ్యస్వామికి నోటీసు పంపిన కోర్టు తిరుగు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అందుకు స్వామి కొంత సమయం కోరారు. ఇదే కేసులో తమ ముందు హాజరుకావాలంటూ సోనియా, రాహుల్ లకు ఢిల్లీ మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అటు ఆదాయపన్ను శాఖ కూడా వారికి నోటీసులు పంపింది. అయితే, రాజకీయ కుట్రతోనే బీజేపీ తమపై ఈ కేసులు పెట్టిందని సోనియా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News