: మూడో టెస్టులో ధోనీవి తప్పుడు వ్యూహాలు: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్


ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరగనున్న నాలుగో టెస్ట్ లో నలుగురు బౌలర్లతో టీం ఇండియా బరిలోకి దిగితే గెలవడం కష్టమని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ అభిప్రాయపడ్డాడు. మూడో టెస్ట్ లో కెప్టెన్ ధోని వ్యూహాలను ఆండ్రూస్ట్రాస్ తప్పుపట్టాడు. మూడో టెస్ట్ జరిగిన సౌతాంప్టన్ పిచ్ మ్యాచ్ జరుగుతున్న కొద్దీ స్పిన్ కు సహకరిస్తుందనీ... అలాంటి పిచ్ పై ధోని అశ్విన్ ను తీసుకోకపోవడం పట్ల ఆండ్రూస్ట్రాస్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీని తప్పించి మూడో టెస్ట్ కు రోహిత్ శర్మను తీసుకోవడం ధోని చేసిన పెద్ద తప్పని ఆండ్రూస్ట్రాస్ వ్యాఖ్యానించాడు. లార్డ్స్ టెస్ట్ గెలిచిన తర్వాత నాలుగో టెస్ట్ ను డ్రా చేసుకుంటే చాలు అనే రక్షణాత్మక వైఖరితో భారత్ మూడో టెస్ట్ మ్యాచ్ లో బరిలోకి దిగిందని స్ట్రాస్ విమర్శించాడు. నెగటివ్ మైండ్ సెట్ తో మ్యాచ్ ఆడితే ఒక్కోసారి ఓటమి తప్పదని స్ట్రాస్ వ్యాఖ్యానించాడు. మూడో టెస్ట్ ఓటమిని మరిచిపోయి... నాలుగో టెస్ట్ లో భారత్ దూకుడుగా ఆడాలని స్ట్రాస్ సూచించాడు.

  • Loading...

More Telugu News