: మరుగుదొడ్డి ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండాలి: గుజరాత్ ముఖ్యమంత్రి
గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో మరుగుదొడ్డి ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కల్పించే విధంగా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని ఆమె వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎలక్షన్ల నుంచి పార్లమెంట్ ఎలక్షన్ల వరకు దేశంలో ఏ ఎన్నికలు జరిగినా ఈ రూల్ ను అమలు చేయాలని ఆమె ఎలక్షన్ కమిషన్ కు సూచించారు. సోమవారం ఐదువేల మంది మహిళలు పాల్గొన్న నీటికమిటీల సదస్సులో ఆమె ఈ వ్యాఖ్యాలు చేశారు. గుజారాత్ లో ఆనందిబెన్ పటేల్ ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతున్నారు. గుజరాత్ లోని మారుమూల పల్లెటూరి ప్రజలకు ఈ కార్యక్రమంపై మరింత అవగాహన కల్పించేందుకే ఆనందిబెన్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయపరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో మరుగుదొడ్లు లేని ఇళ్లలో అబ్బాయిలను పెళ్లి చేసుకోవద్దంటూ యుపీఎ హయాంలో కేంద్రమంత్రిగా ఉన్న జైరాంరమేష్ యువతులకు సూచించారు.