: ఎంసెట్ కౌన్సిలింగ్ వెంటనే జరపకపోతే ఉద్యమమే: తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాల హెచ్చరిక


ఎంసెట్ కౌన్సిలింగ్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని తెలంగాణ బీసీ సంఘాలు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను కోరాయి. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కౌన్సిలింగ్ ను వెంటనే నిర్వహించి, సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐదు బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. ఒకవేళ అలా చేయకపోతే విద్యార్థి ఉద్యమం తప్పదని హెచ్చరించాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంఘం నాయకులు విమర్శలు గుప్పించారు. విద్యపై కనీస అవగాహన లేనివారు మంత్రి పదవులు దక్కించుకుని విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని వారు విమర్శించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ గురించి తేల్చాలన్నా... ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించాలన్నా అధికారులు తగినంత సంఖ్యలో లేరని చెప్పే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం... 'మన ఊరు... మన ప్రణాళికను' ఎలా నిర్వహించిందని వారు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అధికారులు లేకుండా 19వ తారీఖున తెలంగాణ రాష్ట్రం మెత్తం ఇంటింటి సర్వేను ఎలా నిర్వహిస్తున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వారు ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News