: ప్రత్యేక ఉపాధి కల్పన మండలికి టీఎస్ సర్కార్ సన్నాహాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014ను అనుసరించి తెలంగాణకు ప్రత్యేక ఉపాధి కల్పన మండలి ఏర్పాటు చేయాల్సిందిగా టీఎస్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ డి.వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీనికి స్పందించిన ప్రభుత్వం ఉపాధి కల్పన మండలి ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు మరో రెండు మూడు రోజుల్లో వెలువడనున్నాయి.