: ఎంసెట్ కౌన్సిలింగ్ పై సుప్రీంకోర్టు తీర్పును మెచ్చుకున్న టీఆర్ఎస్ ఎంపీ
ఎంసెట్ కౌన్సిలింగ్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ రాష్ట్ర సమితి లోక్ సభాపక్ష నాయకుడు జితేందర్ రెడ్డి స్వాగతించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును శిరోధార్యంగా భావిస్తున్నామని ఆయన అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పును ఇవ్వడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుకు తాము కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు.