: నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్న కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. దీనికి తోడు, జిల్లాకు సంబంధించిన పలు సమస్యలపై జిల్లా స్థాయి అధికారులతో చర్చించనున్నారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు సిద్ధిపేట మీదుగా ఆయన కరీంనగర్ చేరుకుంటారు. కరీంనగర్ లోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఆయన ర్యాలీలో పాల్గొంటారు. 1.15 గంటలకు స్థానికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం 2 గంటలకు కలెక్టరేట్ చేరుకుని భోజనాలు చేస్తారు. 3 గంటల నుంచి వివిధ శాఖలపై సమీక్ష నిర్వహిస్తారు. మళ్లీ రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు.