: భద్రాచలం వద్ద తీవ్రరూపం దాల్చుతున్న గోదావరి
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి పొంగిపొర్లుతోంది. ఈ ఉదయం 7 గంటల సమయానికి ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 33 అడుగులుగా నమోదైంది. అటు, జిల్లాలోని వాజేడు మండలంలోని చీకుపల్లి వాగు పొంగుతోంది. కాజ్ వేపైకి 7 అడుగుల వరకు వరదనీరు చేరడంతో 24 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.