: బీమా బిల్లుపై ఏకాభిప్రాయం వస్తుంది: వెంకయ్యనాయుడు


బీమా బిల్లుకు ఏకాభిప్రాయం వస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, అఖిలపక్ష సమావేశంలో బీమా బిల్లుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని తెలిపారు. ఎన్డీయే పక్షాలు, ఎన్సీపీ, బీజేడీలు బీమా బిల్లుకు మద్దతుగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఒకట్రెండు రోజుల్లో దీనిపై ఏకాభిప్రాయం సాధిస్తామని ఆయన తెలిపారు. కాగా, బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని వామపక్ష పార్టీలతో పాటు తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలు స్పష్టం చేశాయి. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తే భారతీయుల ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆ పార్టీలు పేర్కొంటున్నాయి.

  • Loading...

More Telugu News