: బోరు బావి నుంచి చిన్నారి మృతదేహం వెలికితీత


నెల్లూరు జిల్లాలో బోరుబావిలో నాలుగేళ్ల చిన్నారి శశిరేఖ పడిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారమిచ్చారు. దాంతో, పోలీసులు, రెస్క్యూ టీమ్ కలిసి సహాయక చర్యలు చేపట్టారు. చిన్నారి మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ కొద్దిసేపటి క్రితమే వెలికితీసింది. బాలిక మృతితో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. డక్కిలి మండలంలోని కుప్పాయపాలెం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News