: కృష్ణానది నీటి నిర్వహణ బోర్డు సమావేశం
కృష్ణానది నీటి నిర్వహణ బోర్డు ఇవాళ హైదరాబాదులో సమావేశమైంది. ఈ భేటీలో రెండు రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖాధికారులు పాల్గొన్నారు. వర్షాల వల్ల శ్రీశైలం ప్రాజెక్టులోకి 125 టీఎంసీల వరద నీరు వస్తున్నట్లు అంచనా వేశారు. 125 టీఎంసీల నీటిని గత కేటాయింపుల ఆధారంగానే వాడుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.