: గట్టెక్కిన నేతలు


బంగాళాఖాతంలో చిక్కుకుపోయిన రాష్ట్ర నేతలు సురక్షితంగా తీరానికి చేరుకున్నారు. ఈరోజు ఉదయం కాకినాడ సమీపంలోని హోప్ ఐలాండ్ ను సందర్శించేందుకు వెళ్ళిన రాష్ట్ర మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి, ఎంపీ హర్ష కుమార్, స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ నీతూ కుమార్ తదితరులు బోటులో ఇంధనం అయిపోవడంతో సముద్రం మధ్యలో చిక్కుకుపో్యిన సంగతి తెలిసిందే. దీంతో, అప్రమత్తమైన అధికారులు వెంటనే స్పందించి మరొక బోటును పంపించి మంత్రి, తదితరులను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. వీరు ప్రస్తుతం తాళ్ళరేవు మండలం కోరంగి రేవుకు చేరినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News