: గోల్కొండకు వచ్చిన కేసీఆర్


తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గోల్కొండ కోటను సందర్శించారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ (సోమవారం) గోల్కొండ కోటకు వచ్చిన కేసీఆర్ స్వయంగా కోటలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. మరోపక్క ఇవాళ ఉదయం పలువురు ఉన్నతాధికారులు గోల్కొండ కోటను పరిశీలించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ గోల్కొండ కోటలోని మూడు ప్రాంతాలను పరిశీలించారు. ఈ ఏడాది గోల్కొండ కోట ముందు భాగంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి కోట వెనుక భాగంలో పంద్రాగస్టు వేడుకలను నిర్వహించాలని ఆయన చెప్పారు. అందుకోసం వెనుక భాగంలో శాశ్వత ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

  • Loading...

More Telugu News