: రుణమాఫీకి పదేళ్ల గడువు కోరతాం: యనమల


రైతు రుణమాఫీ బకాయిలు తీర్చేందుకు బ్యాంకులను పదేళ్ల గడువు కోరతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆ గడువులోగా తీర్చేందుకు ష్యూరిటీగా బేవరేజెస్, ఇసుక, ఎర్రచందనంపై వచ్చే ఆదాయాలను ఎస్క్రో అకౌంట్ ల రూపంలో చూపిస్తామని వివరించారు. ఈ నెల 20న శాసనసభలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రవేశపెడతామని ఆయన వెల్లడించారు. లక్ష కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నామని ఆయన తెలిపారు. వ్యవసాయ బడ్జెట్ ప్రత్యేకంగా ప్రవేశపెడతామని ఆయన చెప్పారు. అయితే, బడ్జెట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి తుదిరూపుతీసుకొస్తామని యనమల తెలిపారు.

  • Loading...

More Telugu News