: మాసాయిపేట ఘటన నేపథ్యంలో కాకతీయ స్కూల్ గుర్తింపు రద్దు
మెదక్ జిల్లా మాసాయిపేటలో స్కూల్ బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో కాకతీయ పాఠశాలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. స్కూలు గుర్తింపు క్యాన్సిల్ చేస్తున్నట్లు విద్యాశాఖ ఆర్జేడీ మస్తానయ్య తెలిపారు. బస్సు ఏర్పాటు చేసే విషయంలో యాజమాన్యం అజాగ్రత్తతో వ్యవహరించి చాలా పొరపాటు చేసిందన్నారు. జులై చివరి వారంలో జరిగిన ఈ ప్రమాదంలో పద్నాలుగు మంది చిన్నారులు మరణించిన సంగతి తెలిసిందే.