: అప్పుడు బైక్ తో ఢీ కొట్టేది... ఇప్పుడు కారుతో తొక్కించేసింది


నెల్లూరు జిల్లా హరినాథపురం శివారులో ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న ఓ యువతి ముత్తుకూరు వైపు వెళ్తూ కుడివైపు డివైడర్ ను ఢీ కొట్టింది. కంట్రోల్ చేసుకోలేక ఎదురుగా ఉన్న రెండు కార్లు, 4 మోటారు బైక్ లను ఢీ కొట్టుకుంటూ రోడ్డు పక్క ఉన్న విద్యార్థులపైకి ఎక్కించేసింది. ఈ ఘటనలో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందగా, మిగిలిన ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, యువతిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె ఎక్కడ ఉంది? అనే విషయంపై నోరు మెదపడం లేదు. గతంలో బైక్ రైడ్ చేస్తూ పలువుర్ని ఢీ కొట్టిందనే ఆరోపణలు కూడా ఆ యువతిపై వినిపిస్తున్నాయి. కొత్తగా కారు కొన్న ఆమె... కారుతో కూడా అదేపని చేసిందని మండిపడుతున్నారు.

  • Loading...

More Telugu News