: రెజ్లింగ్ రెఫరీ వీరేందర్ మాలిక్ పై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపులకు పాల్పడ్డ రెజ్లింగ్ రెఫరీ వీరేందర్ మాలిక్ పై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంది. ఈ మేరకు అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. స్కాట్ లాండ్ లోని గ్లాస్గోలో జరుగుతున్న కామన్ వెల్త్ క్రీడల్లో మాలిక్ మద్యం సేవించి అనుచితంగా ప్రవర్తించడంతో... స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అతనిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.