: 'ఎబోలా వైరస్' టెర్రరిస్టుల చేతుల్లో పడితే..!


ఎబోలా వైరస్... తాజాగా ఆఫ్రికా దేశాలతో పాటు పాశ్యాత్య దేశాలను గడగడలాడిస్తోందీ ప్రాణాంతక వైరస్. కనీసం దీనిపై ప్రయోగాలు చేయాలంటేనే బయాలజిస్టులు వణికిపోతున్నారంటే దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వైరస్ మనిషి శరీరంలోని మాంసాన్ని హరించివేస్తుంది. ప్రధానంగా అడవి జంతువుల నుంచి సోకే ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుంది. తీవ్రమైన జ్వరంతో ప్రాణాలకే ముప్పుతెస్తుంది. ఇదిలా ఉంటే, ఎబోలా వైరస్ టెర్రరిస్టు గ్రూపుల చేతిలో పడితే భారీ జననష్టం తప్పదంటున్నారు కేంబ్రిడ్జ్ యూనివర్శిటీకి చెందిన ఆంత్రోపాలజిస్ట్ డాక్టర్ పీటర్ వాల్ష్. ఉగ్రవాదులు ఈ వైరస్ ను పొడిరూపంలో పేలుడు పదార్థాలతో సమ్మిళితం చేసి రద్దీ ప్రాంతాల్లో విస్ఫోటనం జరిపితే పెద్ద ఎత్తున రోగ వ్యాప్తి జరుగుతుందని వాల్ష్ హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ పరీక్షించే ల్యాబ్ లకు అత్యుత్తమ భద్రత ఉంటుందని, ఈ నేపథ్యంలో, ఆఫ్రికాలో ఈ వ్యాధి బారిన పడిన వారి నుంచి మిలిటెంట్ గ్రూపులు వైరస్ శాంపిళ్ళను సేకరించే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు.

  • Loading...

More Telugu News